Wednesday, July 22, 2026
Homeక్రైమ్ న్యూస్తిమ్మారెడ్డిలో డీఎస్పీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

తిమ్మారెడ్డిలో డీఎస్పీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

-సీసీ కెమెరాలు, సైబర్ నేరాలపై అవగాహన

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, జూలై 21:

ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో మంగళవారం ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామస్తులతో సమావేశమై సీసీ కెమెరాల ప్రాధాన్యత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణతో పాటు నేరస్థుల గుర్తింపు, దర్యాప్తు ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు. సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు రక్షణ కవచంలా పనిచేస్తాయని పేర్కొన్నారు.
అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఆయన అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ పెట్టుబడి పథకాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగం, అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.గ్రామస్తులు పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని అభినందిస్తూ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణలో పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్‌హెచ్‌ఓ రాజు, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!