Tuesday, July 21, 2026
Homeరాజకీయంకొండ రెడ్లకు విద్య ఉద్యోగ సంక్షేమ రంగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలి

కొండ రెడ్లకు విద్య ఉద్యోగ సంక్షేమ రంగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలి

📰 Generate e-Paper Clip

అశ్వారావుపేట మండలం , గోగులపూడి గ్రామంలో ఆదివాసి కొండరెడ్ల సంఘం ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల సమావేశం .

నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జులై 21

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ .

కొండరెడ్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలూ ఉదృతం చేయలని కార్యకర్తలకు పిలుపు .

కొండరెడ్లకు విద్య , ఉద్యోగ , సంక్షేమ రంగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ .

అశ్వారావుపేట మండలం , గోగులపూడి గ్రామంలో ఆదివాసి కొండరెడ్ల సంఘం ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల సమావేశం గురుగుంట్ల బాబురెడ్డి అధ్యక్షతన జరిగింది . ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ముర్ల రమేష్ మాట్లడుతూ ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలో జీవిస్తున్న ఆదిమ తెగకు చెందిన సామజికంగా , ఆర్థికంగా , విద్య , ఉద్యోగ రంగాలలో చాలా వెనుకబడి ఉన్నారు అటువండి కొండరెడ్లకు ప్రభుత్వాలు తీవ్రగం అన్యాయం చేస్తున్నాయి అని విమర్శించారు . అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ అవి కొండరెడ్ల దరికీ చేరుకోవడంలేదన్నారు . ప్రతి బడ్జెట్లో ఆదివాసుల సంక్షేమంకోసం వేలకోట్ల రూపాయల కేటాయిస్తున్నప్పటికీ కొండరెడ్ల మౌలిక సమస్యలు అయిన రహదారులు , విద్యుత్తు తదితర అవసరాలు తీరడంలేదన్నారు . అభివృద్ది ముసుగులొ పొలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వేలాదిమంది కొండరెడ్లను అడవినుండి దూరంచేసి పునరావసం కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వాలు గాలికి వదిలేసాయి , ఈ నాటికి కనీస అవసరాలు తీర్చలేదు అని విమర్శించారు . తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువుగా ఉన్న కొండరెడ్లకు అనేక సంవత్సరాలనుండి సాగుచేస్తున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు . కనీసం అర్హులైన కొండరెడ్లకు ఇందిరమ్మ ఇల్లులు సైతం ఇవ్వలేకపోయారు అన్నారు . కొండరెడ్లు ఎదుర్కుంటున్న సమస్యలపైన సంఘటితంగా ఉద్యమించాలని పిలుపుని ఇచ్చారు . ఈ కార్యక్రమంలో కథల రామిరెడ్డి , చిప్పల కొమ్మిరెడ్డి , కెచ్చెల మాదవరెడ్డి , ముర్ల కనకారెడ్డి , ఉమ్మల దుర్గారెడ్డి , ఉప్పిశెట్టి కేతిరెడ్డి , వెన్నెల గోపాలకృష్ణ

రెడ్డి , వేట్ల ముత్యాల రెడ్డి ,వల్ల రామకృష్ణ రెడ్డి , ముర్ల ముత్యాల రెడ్డి , వెన్నెల రవీంద్రారెడ్డి , గోగుల మంగి రెడ్డి , ఉమ్మల బాస్కర్ రెడ్డి , రాజిరెడ్డి , చిప్పల వెంకన్నబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!