Wednesday, July 22, 2026
Homeక్రైమ్ న్యూస్చిన్నమల్లారెడ్డిలో వనమహోత్సవం.. ఈతమొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ అధికారులు

చిన్నమల్లారెడ్డిలో వనమహోత్సవం.. ఈతమొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ అధికారులు

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి రూరల్ జూలై 21:

కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈతమొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా ఈతమొక్కలు నాటారు.అధికారులు తెలిపిన ముఖ్యంశాలు.. పచ్చదనాన్ని పెంపొందించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈత చెట్ల పెంపకం గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి, కుల వృత్తుల ప్రోత్సాహానికి ఈ మొక్కల పెంపకం ఎంతగానో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఎస్ అరుణ్ చంద్ర, సీఐ సంపత్ కృష్ణ, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, ఏపీవో అన్నపూర్ణ, ఎక్సైజ్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ లక్ష్మీ రాజు, ఉప సర్పంచ్ లక్ష్మీ నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పర్యావరణాన్ని కాపాడుతామని ఈ సందర్భంగా అధికారులు, గ్రామస్తులు సంకల్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!