(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 20:
విద్యారంగ అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తున్న విద్యాదాత, ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు 30 రోజులపాటు అమెరికాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి తెలుగు ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు.అమెరికా పర్యటన అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సుభాష్‌రెడ్డికి అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు ఆయనతో కలిసి ఫొటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికా పర్యటన విజయవంతంగా సాగిందని తెలిపారు. అక్కడి తెలుగు సమాజంతో ఆత్మీయంగా గడిపిన అనుభూతి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అమెరికాలోని తెలుగు ప్రజలు తనకు అందించిన ఆత్మీయత, గౌరవాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.విద్య, సామాజిక సేవా రంగాల్లో మరింతగా సేవలందించేందుకు కృషి చేస్తానని సుభాష్‌రెడ్డి తెలిపారు. ముఖ్యంగా యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.సుభాష్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బీబీపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కప్పర రవీందర్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, అశోక్‌గౌడ్, జనగామ ఉప సర్పంచ్ పాత స్వామి, నారాయణరెడ్డి, శేఖర్, మోకాల హనుమంతరెడ్డి, జనార్దన్‌రెడ్డి, బోదాసు సాయికుమార్, సిహెచ్ రవి, సిద్ధరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


