(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆగస్టు 12:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజిపేట్ గ్రామంలో పెద్ద చెరువు అలుగు వద్ద ఏర్పడిన బుంగను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తక్షణమే పూడ్చి మరమ్మతు పనులు చేపట్టారు.
గ్రామ సర్పంచ్ శ్రీమతి ఆశగోనోళ్ల లావణ్య వేంకగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద చెరువును పరిశీలించి, అలుగు వద్ద ఏర్పడిన బుంగను గుర్తించారు. చెరువులో నీటి నిల్వలు అధికంగా ఉన్న సమయంలో బుంగ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. బుంగను పూడ్చి, అవసరమైన మరమ్మతు పనులను పూర్తి చేశారు. దీంతో చెరువు భద్రతకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చెరువు భద్రతతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో చెరువులు, అలుగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోనాల సుభాష్, వార్డు సభ్యులు మంగలి బాలరాజు, కొంకి సాయిలు, గ్రామస్తులు పాల్గొని బుంగ పూడ్చే పనుల్లో సహకరించారు. చెరువు భద్రత–రైతుల ప్రయోజనం–గ్రామ అభివృద్ధే లక్ష్యంగా గ్రామ పంచాయతీ ముందుకు సాగుతుందని తెలిపారు.