Saturday, August 29, 2026
Homeఎడిటోరియల్సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించాలి

సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించాలి

నామినేటెడ్ విధానం రద్దు చేయాలని ఆప్ డిమాండ్

కామారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే ఇందూర్): రాష్ట్రంలో సింగిల్ విండో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రతినిధులే పాలకవర్గాల్లో ఉండాలని, నామినేటెడ్ విధానం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆప్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాదన్ లాల్ జాదవ్ పేర్కొన్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించే సంస్థలకు ప్రజలే తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు కల్పించాలని ఆయన అన్నారు. ప్రజా తీర్పుపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంటే వెంటనే సింగిల్ విండో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.నామినేటెడ్ విధానం ద్వారా రాజకీయ అనుకూలులకు పదవులు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి ప్రజలకు తమ నాయకులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని, నామినేటెడ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని మాదన్ లాల్ జాదవ్ విజ్ఞప్తి చేశారు.

 

సైడ్ కోట్ (బాక్స్ ఐటెమ్):

“ప్రజలే తమ ప్రతినిధులను ఎన్నుకోవాలి.. నామినేషన్లు కాదు” – మాదన్ లాల్ జాదవ్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!