Sunday, July 19, 2026
Homeరాజకీయంలక్క పురుగుల సమస్యపై అధికారుల నిర్లక్ష్యం తగదు

లక్క పురుగుల సమస్యపై అధికారుల నిర్లక్ష్యం తగదు

📰 Generate e-Paper Clip

-టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాలాలి సాయగౌడ్

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి | జులై 13

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాలను వేధిస్తున్న లక్క పురుగుల సమస్యపై అధికారులు వెంటనే స్పందించాలని టీఆర్ఎస్ సదాశివనగర్ మండల అధ్యక్షుడు కాలాలి సాయగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో ఉన్న గోదాముల నుంచి పెద్ద ఎత్తున లక్క పురుగులు బయటకు వచ్చి అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియల్, మర్కల్ గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. గతంలో కూడా ఇదే సమస్య తలెత్తినప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు.లక్క పురుగులు ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలపై, భోజనాలపై, ప్రజల శరీరాలపై వాలుతూ అసౌకర్యం కలిగిస్తున్నాయని తెలిపారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  ప్రజారోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గోదాములపై విచారణ జరిపి, సమస్యకు కారణమైన గోదాములను సీజ్ చేయాలని సాయగౌడ్ డిమాండ్ చేశారు. లక్క పురుగుల నివారణకు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని, లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గోదాముల ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ అధ్యక్షుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, కుప్రియల్ గ్రామ అధ్యక్షుడు చాకలి లింగం తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!