Friday, August 28, 2026
Homeక్రైమ్ న్యూస్జిల్లాలో నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

జిల్లాలో నెలరోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

📰 Generate e-Paper Clip

-అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలకు నో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

-జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి,
జూలై 31:

కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లా వ్యాప్తంగా భారత పోలీసు చట్టం–1861లోని 30, 30(ఎ) సెక్షన్లు అమలులో ఉంటాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు లేదా పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదని ఎస్‌పీ స్పష్టం చేశారు. అలాగే ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు.జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్‌పీ కోరారు. నిబంధనలను ఉల్లంఘించి పోలీసు అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!