టి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి: పార్టీ అధ్యక్షురాలు కవి
నమస్తే ఇందూర్/ కామారెడ్డి, ఆగస్టు 2:
టి ఆర్ ఎస్ పార్టీని కామారెడ్డి జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు యువత ముందుండి పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. శనివారం రాత్రి హైదరాబాద్లోని టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి యువ నాయకులు అంకితభావంతో పనిచేయాలని కవిత సూచించారు.కామారెడ్డి జిల్లాలో పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు విస్తరించి, యువతను మరింతగా పార్టీతో అనుసంధానం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ నాయకులు సాయిలు, రమేష్ రాథోడ్, జొన్నల రాము తదితరులు పాల్గొన్నారు.


