Friday, August 28, 2026
Homeతెలంగాణఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల విజయకేతనం

ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల విజయకేతనం

📰 Generate e-Paper Clip

ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల విజయకేతనం

నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆగష్టు 3

2వ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్‌లో ఘన విజయం

పాల్వంచ: ఆగస్టు 2న నిర్వహించిన 2వ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్లో పాల్వంచ ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి భారత దేశ గౌరవాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపారు.

ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో ఎక్స్‌ట్రీమ్ విద్యార్థులు 13 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించి మొత్తం 3 గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌లు కైవసం చేసుకుని ఘన విజయాన్ని నమోదు చేశారు.

గ్రాండ్ ఛాంపియన్‌షిప్ విజేతలు

క్యాడెట్ విభాగంలో: చిన్నారి దితికశ్రీ

జూనియర్స్ విభాగంలో: మనుశ్రీ

సీనియర్స్ విభాగంలో: హర్షిక

తమ అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో నిలిచి, భారత మాత ముద్దుబిడ్డలుగా ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను సాధించిన విద్యార్థులు విజయంతో తిరిగి వస్తున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థుల విజయంపై గ్రాండ్ మాస్టర్ కోనే సూరిబాబు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!