Thursday, July 23, 2026
Homeరాజకీయంచేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం

చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం

📰 Generate e-Paper Clip

చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం

-చేనేత వస్త్రాలు ధరిద్దాం నేతన్నకు అండగా ఉందాం

-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజ్ గౌడ్

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
బీబీపేట్ జులై 22:

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల చేనేత సహకార సంఘం అధ్యక్షుడుగా మాందాపూర్ కు చెందిన అల్వాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చేనేత వస్త్రాలు భారతదేశం యొక్క గొప్ప సంప్రదాయానికి ప్రతీకని యంత్రాల సాయం లేకుండా చేతితో మగ్గం ద్వారా వీటిని తయారుచేస్తారని అన్ని కాలాల్లోనూ ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటాయన్నారు అందరం చేనేత వస్త్రాలు ధరించి నేతన్నకు అండగా నిలవాలన్నారు మండలంలో ప్రజలకు చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని చేనేత సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ ప్రతినిధులు అల్వాల నర్సింలు, రఘు, రామచంద్రం,జగన్, బలరాంలు, చందు, కాంగ్రెస్ నాయకులు కమ్మరి గంగారాంలు, గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రోడ్డ రాజు, మాందాపూర్ వార్డ్ సభ్యులు శివునూరి నర్సింలు ,రోడ్డ లావణ్య బాబు, సామెల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!