(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జూలై 21:
స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టిజిసిజిటిఏ) యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో యూనిట్ అధ్యక్షుడిగా డాక్టర్ కె. కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా అంకం జయప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డాక్టర్ పి. విశ్వప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ కడారు సురేందర్ రెడ్డితో పాటు పలువురు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాములు, డాక్టర్ జి. శ్రీనివాసరావు, శ్రీవల్లి, రాజశ్రీ తదితరులు పాల్గొని నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

