Saturday, August 29, 2026
Homeఎడిటోరియల్ఆర్మూర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్..

ఆర్మూర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్..

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం.. ముఠా అరెస్ట్..

నమస్తే ఇందూరు వార్త ప్రతినిధి జి రాజ్ కుమార్ ఆర్మూర్ ఆగస్టు:- 3 ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం కూరగాయల మార్కెట్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా గంజాయి చిక్కింది. నిజామాబాద్ వైపు నుంచి ఒకే పల్సర్ మోటార్ సైకిల్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపేందుకు యత్నించగా,వారు బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించారు.దీంతో పోలీసులు చాకచక్యంగా వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

పంచుల సమక్షంలో బైక్‌ను తనిఖీ చేయగా,అందులో చిన్న ప్యాకెట్లలో అమర్చిన 20 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.అరెస్ట్ అయిన నిందితులు ఆర్మూర్ మండలం గోవింద్ పేటకు చెందిన రాపిడో డ్రైవర్ ఆకుల అజయ్ (26), బ్రాహ్మణపల్లికి చెందిన రెస్టారెంట్ వర్కర్ అభిలాష్ (18), మరియు మహారాష్ట్ర నాందేడ్ నివాసి మహమ్మద్ ముజాహిద్ అలియాస్ ముజీబ్ (20)గా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

ఈ సందర్భంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి విక్రయించినా,రవాణా చేసినా లేదా సేవించినా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!