Friday, August 28, 2026
Homeరాజకీయంఫరీద్‌పేట్‌లో ముత్యాలమ్మ ఆలయం, శ్మశాన వాటికకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు

ఫరీద్‌పేట్‌లో ముత్యాలమ్మ ఆలయం, శ్మశాన వాటికకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 12:

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఫరీద్‌పేట్,గ్రామంలో మెయిన్ రోడ్డు నుంచి ముత్యాలమ్మ ఆలయం, శ్మశాన వాటిక వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహరెడ్డి, ఉప సర్పంచ్ కోల బాలగౌడ్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల పురోగతిని పరిశీలించిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లు. గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందేలా అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఆలయం, శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు రాత్రి వేళల్లో రాకపోకలకు ఇబ్బందులు తగ్గనున్నాయని తెలిపారు.విద్యుత్ స్తంభాలను ఫరీద్‌పేట్ గ్రామానికి మంజూరు చేయించేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డిలకు గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహరెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అవసరాలను గుర్తించి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జనపాల శ్రీకాంత్, తమ్ముడి స్వామి, బట్టెంకి బాలరాజు, దేవోళ్ల రాములు, బట్ట శంకర్, ఎంకొల్ల బాలనర్సు, కారోబార్ రాజకిష్టని గంగరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!