Tuesday, November 3, 2026
Homeహిందూ ధర్మంవిశ్వకర్మ ఏక్తా యాత్రకు కామారెడ్డిలో ఘన స్వాగతం..

విశ్వకర్మ ఏక్తా యాత్రకు కామారెడ్డిలో ఘన స్వాగతం..

📰 Generate e-Paper Clip

-బస్వాపూర్, బిక్కనూరు, కామారెడ్డిలో విశ్వకర్మ సోదరులతో సమావేశాలు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 21:

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి నేతృత్వంలో హైదరాబాద్ బోరబండ శ్రీ విశ్వకర్మ దేవాలయం నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న 1,700 కిలోమీటర్ల 74 రోజుల విశ్వకర్మ ఏక్తా యాత్ర ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బస్వాపూర్, బిక్కనూరు ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సోదరులతో సమావేశాలు నిర్వహించారు. కామారెడ్డిలో జరిగిన కార్యక్రమానికి విశ్వకర్మ రాష్ట్ర నాయకులు బ్రహ్మశ్రీ తిప్పర్తి సతీష్ విశ్వకర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి మాట్లాడుతూ విశ్వకర్మల పూర్వవైభవాన్ని పునరుద్ధరించడం, సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక పరిరక్షణ, నాయకత్వ అభివృద్ధి లక్ష్యంగా యాత్ర కొనసాగుతోందన్నారు. “గుర్తింపు నుంచి గౌరవం వరకు.. నైపుణ్యం నుంచి ఆదాయం వరకు.. వృత్తి నుంచి పారిశ్రామిక శక్తి వరకు” అనే దృక్పథంతో 25 జాతీయ డిమాండ్లను ‘విశ్వకర్మ జాతీయ అభివృద్ధి చార్టర్–2026’గా దేశం ముందుంచుతున్నట్లు తెలిపారు.
విశ్వకర్మ సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, వృత్తి డేటా సేకరణతో పాటు జాతీయ విశ్వకర్మ సంక్షేమ, అభివృద్ధి కమిషన్ ఏర్పాటు, ప్రత్యేక కేంద్ర వ్యవస్థ, నైపుణ్య–సాంప్రదాయ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి అంశాలను చార్టర్‌లో ప్రతిపాదించినట్లు చెప్పారు. సంప్రదాయ వృత్తులను ఆధునిక పరిశ్రమలతో అనుసంధానించేందుకు ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు వివరించారు.కమ్మరం, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్, మెషినింగ్, కార్పెంటరీ, కంచర, శిల్పకళ, స్వర్ణకార తదితర వృత్తులకు ఆధునిక యంత్రాలు, నైపుణ్య శిక్షణ, ముడి పదార్థాలు, మార్కెట్, ఎగుమతి అవకాశాలు కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. రుణ సదుపాయాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, సామాజిక భద్రత, ఆరోగ్య–ప్రమాద బీమా, వృద్ధాప్య పింఛన్ వంటి అంశాలను కూడా చార్టర్‌లో చేర్చినట్లు పేర్కొన్నారు.విశ్వకర్మల శిల్పశాస్త్రం, వాస్తు, దేవాలయ నిర్మాణం, శిల్పకళ, పురాతన పరికరాలు, మాన్యుస్క్రిప్టులు, మౌఖిక సంప్రదాయాలను పరిరక్షించేందుకు పరిశోధన, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. “ స్కిల్ + టూల్స్+క్యాపిటల్ + మార్కెట్ + సోషల్ సెక్యూరిటీ” అనే ఐదు అంశాల ఆధారంగా ప్రతి అర్హత కలిగిన విశ్వకర్మ కుటుంబానికి గౌరవప్రదమైన, స్థిరమైన జీవనోపాధి కల్పించడమే 25 డిమాండ్ల ప్రధాన లక్ష్యమన్నారు.సెప్టెంబర్ 17న హైదరాబాద్ బోరబండ నుంచి ప్రారంభమైన యాత్ర నవంబర్ 29న ఢిల్లీలో జరిగే ముగింపు సభతో పూర్తవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా విశ్వకర్మ–విశ్వబ్రాహ్మణ సోదరులు,
యువత, మహిళలు, వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు యాత్రలో భాగస్వాములు కావాలని పుష్పగిరి కోరారు.కార్యక్రమంలో వడ్ల సిద్ధ రాములు, సిరికొండ సుదర్శన్ చారి, తిప్పర్తి రాజు, వెగ్గిలం గోపాల్ చారి, శ్రీనివాస్ చారి, ప్రభాకర్ చారి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!