(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 10:
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో దోమల నివారణ కోసం ప్రత్యేక ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమల వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.14వ వార్డు కౌన్సిలర్ రామ్శెట్టి హర్షిత కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులతో సమన్వయం చేస్తూ ఫాగింగ్ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. వార్డులోని ప్రధాన వీధులు, కాలనీలు, మురుగు కాలువల పరిసర ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహించి దోమల నిర్మూలనకు కృషి చేశారు.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కౌన్సిలర్ హర్షిత సూచించారు. అలాగే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని కోరారు.వార్డు అభివృద్ధి, ప్రజా ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ అవసరమైన చర్యలు కొనసాగిస్తామని కౌన్సిలర్ రామ్శెట్టి హర్షిత తెలిపారు.

