Monday, July 20, 2026
Homeతెలంగాణమున్నూరు కాపు నేత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య పటేల్

మున్నూరు కాపు నేత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య పటేల్

📰 Generate e-Paper Clip

-త్వరలో జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 18:

మున్నూరు కాపు ఎల్లారెడ్డి నియోజకవర్గ కో-కన్వీనర్ కట్లకుంట్ల సుధాకర్ తల్లి మృతిపై తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సుధాకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా దేవయ్య పటేల్ మాట్లాడుతూ, మున్నూరు కాపు సంఘం బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో త్వరలోనే జిల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో స్థానిక కమిటీలను ఏర్పాటు చేసి, జిల్లా కమిటీని మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.సంఘ సభ్యుల సంక్షేమం, సామాజిక అభివృద్ధి, యువత ప్రోత్సాహం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. మున్నూరు కాపు సమాజం ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు అనుమాల గంగయ్య, జిల్లా కో-కన్వీనర్ బండి ప్రవీణ్, బండారి శేఖర్, రామారెడ్డి సర్పంచ్, అశోక్, లింబాద్రి రాజు, అనుమాల రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!