Monday, July 20, 2026
Homeతెలంగాణభక్తిశ్రద్ధలతో ఆషాడ బోనాలు

భక్తిశ్రద్ధలతో ఆషాడ బోనాలు

📰 Generate e-Paper Clip

భక్తి శ్రద్ధలతో గుర్రాలచెరువులో ఘనంగా ఆషాడ బోనాలు!

నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 19

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా సాగిన వేడుకలు.. భక్తుల కోలాహలం!

బోనాలు ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్న బిఆర్ఎస్ కీలక నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ డా. భూక్యా ఉదయ జ్యోతి!

అశ్వారావుపేట, :తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల వేడుకలు అశ్వారావుపేట మండల పరిధిలోని గుర్రాలచెరువు గ్రామంలో శ్రీ స్వయంభూ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగాయి. ఆషాడ మాసంలో అమ్మవారిని పూజిస్తే అనారోగ్యాలు తొలగి, సుఖసంతోషాలు కలుగుతాయని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే గుర్రాలచెరువు గ్రామంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.

గ్రామంలోని మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, నిష్టతో బోనాలను తయారుచేసి, పసుపు, కుంకుమ, వేపాకులతో ఘటాలను అందంగా అలంకరించారు. “బోలో బోనాలమ్మా బోల్” అంటూ భక్తుల నినాదాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, పోతురాజుల నృత్యాల నడుమ గ్రామ వీధుల్లో బోనాల ఊరేగింపు అత్యంత భక్తిమయంగా సాగింది.

ఈ వేడుకల్లో అశ్వారావుపేట బిఆర్ఎస్ () పార్టీ ప్రముఖ కీలక నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, అశ్వారావుపేట మున్సిపాలిటీ 14 వ వార్డ్ బిఆర్ఎస్ కౌన్సిలర్, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ భూక్యా ఉదయ జ్యోతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు స్వయంగా సాంప్రదాయబద్ధంగా బోనాలను తలపై ఎత్తుకొని గ్రామ వీధుల్లో భక్తులతో కలిసి ఊరేగింపుగా నడిచారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ప్రముఖ నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ మాట్లాడుతూ “అమ్మవారి కృపాకటాక్షాలతో మండలంలోని ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు విలసిల్లాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నాం” అని తెలిపారు.

కౌన్సిలర్, ప్రముఖ వైద్యురాలు డా. భూక్యా ఉదయ జ్యోతి మాట్లాడుతూ “ఇలాంటి సాంప్రదాయ పండుగల ద్వారానే మన తెలంగాణ సంస్కృతి, ఐక్యత నిలబడుతుందని, ప్రజలందరూ ఇంతటి భక్తిభావంతో పండుగలో పాల్గొనడం చాలా అభినందనీయం” అని పేర్కొన్నారు.

బోనాల సమర్పణ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యువకులు మరియు గుర్రాలచెరువు గ్రామ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!