Friday, July 24, 2026
Homeరాజకీయంఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి..

-ఓటు హక్కు పరిరక్షణకు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వినియోగించుకోండి పట్టణ అధ్యక్షుడు ఐరెని సందీప్

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జూలై 21:

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు వెన్నెముక వంటిదని, ప్రతి అర్హ పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని పట్టణ అధ్యక్షులు ఐరెని సందీప్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమం ఓటరు జాబితాలను పూర్తిగా పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఎంతో కీలకమైనదని అన్నారు. ఓటరు జాబితాలో తమ పేరు సక్రమంగా ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సవరణలు చేయించుకోవాలని సూచించారు.కొత్తగా ఓటు హక్కు పొందిన యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, చిరునామా మార్పు, పేరు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉన్న వారు అవసరమైన పత్రాలతో సవరణలు చేయించుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదు, సవరణ, ధృవీకరణ ప్రక్రియలను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యంత అవసరమని, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని సందీప్ అన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, కార్యకర్తలందరి బాధ్యత అని పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డులు, కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, ఒక్క అర్హ ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఐరెని సందీప్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!