(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 04:
కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. రఘు తెలిపారు.జిల్లాలోని భిక్కనూర్ గురుకులం–1, ఉప్పల్వాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
(సి ఓ ఈ) కాలేజీ–2, ఎల్లారెడ్డి గురుకులం–3, అచ్చంపేట గురుకులం–4లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నాలుగు గురుకులాలకు సంబంధించిన స్పాట్ అడ్మిషన్లు ఒకే కేంద్రంలో నిర్వహించబడతాయని, ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఆసక్తి గల విద్యార్థులు జూలై 6వ తేదీ (సోమవారం) ఉదయం 9 గంటలకు భిక్కనూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు (టీసీ, బోనాఫైడ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్)తో పాటు 6 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, రెండు జిరాక్స్ సెట్లను తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ వంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.కాగా, ఈ నాలుగు గురుకులాల్లో భిక్కనూర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)గా నిర్వహించబడుతూ విద్యార్థులకు ప్రత్యేక విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

