(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 13:
కామారెడ్డి జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో వాటర్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న దేవునిపల్లి గ్రామానికి చెందిన సామల శ్రీనివాస్ (40) పాము కాటుకు గురయ్యాడు. ఎమ్మార్వో కార్యాలయం పక్కన ఉన్న వాటర్ ట్యాంకుల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పాము కాటుకు గురైన శ్రీనివాస్‌ను సహచరులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి, చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని కోరినట్లు సమాచారం.

