(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 04:
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామానికి చెందిన దోమకొండ చిన్న సాయిలు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.ఉప్పల్‌వాయి గురుకుల పాఠశాలలో సాయిలుతో కలిసి చదువుకున్న సహ విద్యార్థులు సంగోజీవాడి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా స్నేహితుడి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందించి మనోధైర్యం కల్పించారు.అనంతరం సాయిలు అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివాజీ, అనిల్ కుమార్, సిద్ధిరాములు, సుధాకర్, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

