Monday, November 2, 2026
Homeరాజకీయంసర్పంచుల సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రం..

సర్పంచుల సమస్యలపై కమిషనర్‌కు వినతి పత్రం..

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 21:

సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత కమిషనర్ మేడం ని కలిసి సర్పంచుల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీల పరిపాలన, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్, సర్పంచులకు గౌరవ వేతనం చెల్లింపు, గ్రామపంచాయతీల పరిధిలో వినియోగించే విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించడం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా గ్రామపంచాయతీలు వసూలు చేస్తున్న ట్యాక్స్‌ల ద్వారా వచ్చిన నిధులను ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుని, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు మంజూరయ్యే నిధులు నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారులు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని సర్పంచులు కమిషనర్‌ను కోరారు.
సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ మేడం హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మేడం ని సర్పంచుల ప్రతినిధులు ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!