పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి
సూర్యాపేట జిల్లా /నమస్తే ఇందూర్ ప్రతినిధి/ సెప్టెంబర్ 30: సూర్యాపేట:నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాలు, గ్రాడ్యుయేట్ ఓటర్ల సమన్వయంపై చర్చించారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి సర్వోత్తమ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల్లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


