జోగిపేట మార్కెట్ యార్డులో ఘనంగా బతుకమ్మ సంబురాలు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం బతుకమ్మ.
ఈ కార్యక్రమంలో అందోల్ జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎస్ కృష్ణ రెడ్డి మాజీ చైర్మన్ గూడెం మల్లయ్య
*బతుకమ్మ ఎత్తుకున్న చైర్మన్ ఎస్ కృష్ణ రెడ్డి మాజీ చైర్మన్ గూడెం మల్లయ్య పదో వాడు కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్
సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /అక్టోబర్ 15
ఆందోల్ నియోజకవర్గం జోగిపేట మున్సిపాలిటీ
ప్రపంచంలో పూలతో జరుపుకునే అరుదైన పండుగ బతుకమ్మ అని, తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సాంస్కృతిక వైభవానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అందోల్ జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ పేర్కొన్నారు.మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో (బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి బతుకమ్మ పూజాకార్యక్రమాలు నిర్వహించి, బతుకమ్మ ఆడారు . ఈ సందర్భంగా చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. బతుకమ్మను తెలంగాణ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారని పేర్కొన్నారు. పండుగ విశిష్టతను చాటిచెప్పేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించారు బతుకమ్మ సంబురాలు జోగిపేట మార్కెట్ యార్డ్ లో ప్రాంగణంలో పెద్దఎత్తున నిర్వహించారు.ఈకార్యక్రమంలో వివిధశాఖలజిల్లాఅధికారులు,మహిళ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పదో వార్డ్ కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ 11వ వార్డ్ కౌన్సిలర్ గూడెం కల్పన నాగరాజు 16వ వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాస్ 12వ వార్డ్ కౌన్సిలర్ కోరబోయిన నాగరాజు (నాని) అలాగే 11వ వార్డ్ ఆడపడుచులు యువకులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు


