Friday, October 30, 2026
Homeఎడిటోరియల్దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

📰 Generate e-Paper Clip

నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి: తల్లమల్ల హసేన్

సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 4:

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లెపల్లి గ్రామంలో గ్రామసభ సందర్భంగా దళిత మహిళ, వీఓఏ గనిపల్లి మాధవిపై జరిగిన దాడిని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ తీవ్రంగా ఖండించారు.గ్రామసభ సందర్భంగా మాధవిని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చిందని, దళిత మహిళపై బహిరంగంగా దాడి చేయడం ప్రజాస్వామ్య సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.గ్రామసభలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సి ఉండగా, మహిళను కులపరంగా అవమానించడం, అసభ్య పదజాలంతో దూషించడం, దాడికి పాల్పడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.బాధితురాలికి న్యాయం జరిగేలా అధికారులు తక్షణమే స్పందించాలని తల్లమల్ల హసేన్ డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.బాధిత మహిళకు రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!