(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 26:
ఉప సర్పంచ్ ఫోరం కామారెడ్డి మండల అధ్యక్షుడిగా మలవత్ రవీందర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడికి సంఘం నాయకులు అభినందనలు తెలియజేసి, మండలంలోని ఉప సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి ఉప సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో ఉప సర్పంచ్ల పాత్ర కీలకమని, వారి హక్కుల పరిరక్షణతో పాటు సమస్యల పరిష్కారం కోసం ఫోరం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బచ్చయ్య, గోపాల్, ప్రధాన కార్యదర్శి తోట శిరీష భూపతి, క్యాషియర్ కమ్మరి స్వప్న లక్ష్మీనారాయణ, సలహాదారులు చింతల నర్సింలు, రాజశేఖర్, కొండి అశోక్, గూడెం తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అనంతరం నాయకులు పరస్పరం అభినందనలు తెలియజేసి, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.


