Sunday, July 19, 2026
Homeతెలంగాణబీబీపేట్ మండల నూతన ఎంపీడీవోగా ఆర్. నరేష్ బాధ్యతల స్వీకరణ

బీబీపేట్ మండల నూతన ఎంపీడీవోగా ఆర్. నరేష్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

 

(నమస్తే ఇందూర్) బీబీపేట్, జూలై 03:

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల నూతన మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) ఆర్. నరేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటివరకు బీబీపేట్ మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించిన పూర్ణ చంద్రోదయ కుమార్ మాట్లాడుతూ, 2022 సంవత్సరం నుండి బీబీపేట్ మండలంలో సేవలు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నాలుగు సంవత్సరాల పదవీకాలంలో మండల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
విధుల నిర్వహణలో అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అనధికార సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ప్రెస్ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తమ సహకారం వల్లే మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయగలిగామని పేర్కొన్నారు.
నూతన ఎంపీడీవో ఆర్. నరేష్ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!