Friday, October 30, 2026
Homeరాజకీయంబోర్లం గ్రామంలో ఎస్.ఐ.ఆర్. సర్వే పరిశీలన

బోర్లం గ్రామంలో ఎస్.ఐ.ఆర్. సర్వే పరిశీలన

📰 Generate e-Paper Clip

-ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారుల సూచన

(నమస్తే ఇందూర్) | కామారెడ్డి
జిల్లా బాన్సువాడ జూలై 21:

బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమం కింద ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, కుటుంబ సభ్యుల వివరాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం అధికారులు పరిశీలించారు. గ్రామంలోని బూత్ నంబర్ 214, 215 పరిధిలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్, గ్రామ సర్పంచ్ మన్నె రమేష్ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆగస్టు 3వ తేదీలోగా అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఎవరూ మినహాయింపుకు గురికాకుండా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు సూచించారు. గ్రామంలో ఓటరు నమోదు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. బోర్లం గ్రామ కార్యదర్శి శివాజీ మాట్లాడుతూ, గ్రామంలో కుటుంబ సభ్యుల వివరాల నమోదు ప్రక్రియ 94 శాతం పూర్తైందని తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్ కిరణ్, జీపీఓ రవీందర్, బూత్ లెవెల్ ఏజెంట్ మన్నె చిన్న సాయిలు, వార్డ్ ఇన్‌చార్జి మన్నె సాయిలు, ఐకేపీ సిబ్బంది సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కె. శ్రీనివాస్ రెడ్డి, శిరీష, దంతుల రాజ్‌కుమార్, నర్సింలు, గంగామణి, గంగారం, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!