నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జులై 17
2వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌కు డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
హైదరాబాద్‌లోని కోట్ల భాస్కర్ ఇండోర్ స్టేడియం వేదికగా 2026 ఆగస్టు 1, 2 తేదీల్లో జరగనున్న 2వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్కు పాల్వంచకు చెందిన డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం విశేషం.పాల్వంచలోని ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో గ్రాండ్ మాస్టర్ కోనే సూరిబాబు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రింది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులు: జి. హర్షిక, జి. నిహాస్రీ, ఎం. మనుశ్రీ ,బి. రోజసా ,ఆర్. దితికఈ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌కు ప్రముఖ సినీ నటుడు డా. సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్‌గా ఎం. కన్నన్ గౌడ్ వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నైస్ షాజీ, వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, అలాగే ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ కోనే సూరిబాబు అభినందించి, పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్వంచకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

