ఏడేళ్లుగా రైతుకు అందని రైతు భరోసా నిధులు
దాదాపు 90 వేల రూపాయలు రైతుకు దక్కలేదు..
రైతు నోట్లో మట్టి
అధికారి జేబులోకి
రైతు భరోసా నిధులు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 24:
ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు సర్కారు అందిస్తున్న రైతు భరోసా పథకం నిధులు పక్కదారి పట్టాయి. ఏడేళ్లు గా రైతుకు దక్కలేదు. రైతు భరోసా పథకం నిధులు వ్యవసాయ శాఖ అధికారి జేబుల్లోకి వెళ్లాయి. ఏడేళ్లుగా దాదాపు 90 వేల రూపాయలు సదరు వ్యవసాయ అధికారి స్వంత ఖాతాల్లోకి వెళ్లాయి. గమ్మతు ఏమిటంటే బాధిత రైతు తనకు రైతు భరోసా పథకం నిధులు రావటం లేదని వ్యవసాయ శాఖ ఆఫీసుల చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు. టెక్నికల్ మిస్టేక్ అనే ఘనత వహించిన వ్యవసాయ శాఖ అధికారులు తప్పించుకుంటున్నారు.రాజంపేట మండలం షేర్ శంకర్ తండా కు చెందిన గిరిజన రైతు కాట్ రోత్ కిషన్ తండ్రి దేవుల కు ఎకరం 2 గుంటల భూమి ఉంది.2019 యాసంగి నుండి రైతు భరోసా పథకం నిధులు రావడం లేదని ఆఫీసుల చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు. టెక్నికల్ మిస్టేక్ అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కుంటి సాకులు చెబుతూ వస్తున్నారు.ఆనాటి కొండాపూర్ వ్యవసాయ శాఖ ఏ.ఇ.ఓ. మౌనికప్రస్తుతం బిక్నూర్ మండలం రామేశ్వర్ పల్లి లో ఏ.ఈ.ఒ. గా పనిచేస్తున్నారు.రైతు కిషన్ రాయితీ భరోసా పథకం నిధులు ఏ.ఈ.ఒ. మౌనిక కామారెడ్డి యూనియన్ బ్యాంక్ లో పడుతున్నాయి దాదాపు 90 వేలు రూపాయలు రైతు కు రావాల్సిన భరోసా పథకం నిధులు వ్యవసాయ శాఖ అధికారీని ఖాతాలో పడుతున్నాయనిశాఖ అధికారుల సమాచారం.రైతు భరోసా నిధులు ఏ.ఈ.ఒ. మౌనిక ఖాతాలో పడుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. ఏ.ఈ.ఒ. పై శాఖ పర చర్యల కోసం సిఫారసు చేసినట్లు కామారెడ్డి జిల్లా సదరు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు.
-ఏ ఈ ఒ సస్పెన్షన్ చేసినట్లు రాజంపేట ఏవో స్పష్టం
రామేశ్వర్ పల్లి ఏ.ఈ.ఒ. మౌనికను సస్పెండ్ చేసినట్లు రాజంపేట మండల వ్యవసాయ అధికారిని జోత్స్న ప్రియదర్శిని స్పష్టం చేశారు. ఏఈఓ పై శాఖ పర చర్యలు తీసుకున్నట్లు రాజంపేట మండల వ్యవసాయ అధికారిని వెల్లడించారు.


