Friday, October 30, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతమహిళల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక సేన 6వ వార్షికోత్సవం..

మహిళల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక సేన 6వ వార్షికోత్సవం..

📰 Generate e-Paper Clip

-వైభవంగా గణనాథునికి పూజలు

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
సెప్టెంబర్ 22:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి 10వ వార్డులో కురుమ సంఘం ఆధ్వర్యంలో వినాయక సేన 6వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా మహిళలే ముందుండి గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రతి ఏడాది వినాయక ఉత్సవాలను నిర్వహించడం విశేషంగా నిలుస్తోంది.మహిళల ఆధ్వర్యంలో గణపయ్యను ప్రతిష్ఠించి ఉత్సవాలను నిర్వహించడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మంగళహారతులు నిర్వహిస్తుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గణపయ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.వినాయక మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా మహిళలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చిన్నారులు, యువత సైతం ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఆరు సంవత్సరాలుగా మహిళల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తూ భక్తి, ఐక్యతకు ప్రతీకగా వినాయక సేన నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్రవంతి, హారిక, నికిత, సంయుక్త, స్వాతిక, తేజ, స్పందన, జ్ఞానశ్రీ, అక్షమాల, శాన్విత, సహర్ష్, మాన్విత్, వర్షిత్, కుశాల్, మోక్షిత్ తదితర భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!