Friday, October 30, 2026
Homeఎడిటోరియల్కులాలకు అతీతంగా అర్హత ఆధారంగా అవకాశాలు కల్పించాలంటున్న రిజర్వేషన్‌ కమిటీ

కులాలకు అతీతంగా అర్హత ఆధారంగా అవకాశాలు కల్పించాలంటున్న రిజర్వేషన్‌ కమిటీ

📰 Generate e-Paper Clip

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు డిమాండ్.

* కులాలకు అతీతంగా అర్హత ఆధారంగా అవకాశాలు కల్పించాలంటున్న రిజర్వేషన్‌ కమిటీ

* కోటి సంతకాల సేకరణకు శ్రీకారం.. తెలంగాణలో అవగాహన కార్యక్రమాలు

నమస్తే ఇందూర్/హైదరాబాద్‌: రిజర్వేషన్‌ విధానంలో మార్పులు తీసుకురావాలనే డిమాండ్‌తో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కమిటీ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కుల ప్రాతిపదికకు బదులుగా ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారికి అవకాశాలు కల్పించాలని కమిటీ కోరుతోంది. ఈ డిమాండ్‌పై ప్రజల మద్దతు కూడగట్టేందుకు కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్‌ వ్యవస్థలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశం ఉంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు మద్దతు తెలిపే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి మార్పులపై దేశవ్యాప్తంగా కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కమిటీ ప్రధాన డిమాండ్లు

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కమిటీ విడుదల చేసిన ప్రచార సమాచారంలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించింది. కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి 50 శాతం వరకు రిజర్వేషన్‌ కల్పించాలి, రిజర్వేషన్లపై ప్రతి ఐదేళ్లకోసారి సమీక్ష నిర్వహించాలి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి, పేద కుటుంబాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నవి అందులో ఉన్నాయి.

ప్రజల అభిప్రాయాల కోసం సంతకాల సేకరణ

రిజర్వేషన్‌ విధానంపై ప్రజల్లో చర్చ జరగాలని, తమ ప్రతిపాదనలకు ప్రజల మద్దతును తెలుసుకునేందుకు కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు కమిటీ పేర్కొంది. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాల్లో వెనుకబడిన కుటుంబాలకు అండగా ఉండే విధంగా విధానాలను రూపొందించాలన్నది తమ ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!