Sunday, July 19, 2026
Homeరాజకీయంఆలయ వైభవం మరింత పెరగాలి

ఆలయ వైభవం మరింత పెరగాలి

📰 Generate e-Paper Clip

శ్రీ కోదండరామస్వామి వారి అనుగ్రహంతో ఆలయ వైభవం మరింత పెరగాలి – ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు

05-07-26

భద్రాచలం నియోజకవర్గం.

భద్రాచలం, శిల్పినగర్ ఏరియాలో శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ పూర్వక కళావాహన కార్యక్రమాలు, యాగం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  మాట్లాడుతూ, ఆలయాల జీర్ణోద్ధరణ, సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భద్రాచలం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!