Sunday, July 19, 2026
Homeతెలంగాణకామారెడ్డి జిల్లా గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు..

కామారెడ్డి జిల్లా గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లు..

📰 Generate e-Paper Clip

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి
జులై 04:

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. రఘు తెలిపారు.జిల్లాలోని భిక్కనూర్ గురుకులం–1, ఉప్పల్వాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
(సి ఓ ఈ) కాలేజీ–2, ఎల్లారెడ్డి గురుకులం–3, అచ్చంపేట గురుకులం–4లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నాలుగు గురుకులాలకు సంబంధించిన స్పాట్ అడ్మిషన్లు ఒకే కేంద్రంలో నిర్వహించబడతాయని, ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఆసక్తి గల విద్యార్థులు జూలై 6వ తేదీ (సోమవారం) ఉదయం 9 గంటలకు భిక్కనూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు (టీసీ, బోనాఫైడ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్)తో పాటు 6 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, రెండు జిరాక్స్ సెట్లను తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలు పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ వంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.కాగా, ఈ నాలుగు గురుకులాల్లో భిక్కనూర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)గా నిర్వహించబడుతూ విద్యార్థులకు ప్రత్యేక విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!